Khelo India: ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’
Sakshi Education
ప్రతిభ గల క్రీడాకారుల ప్రదర్శనకు పదును పెట్టే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్‌ఎఫ్‌ఏ) జతకట్టింది.
యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రూ.12.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఏ వ్యవస్థాపకులు రిషికేశ్ జోషి తెలిపారు. కుర్రాళ్ల ప్రతిభాన్వేషణలో భాగమైన ఎస్‌ఎఫ్‌ఏ స్పాన్సర్‌షిప్ లభించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఎస్‌ఎఫ్‌ఏ ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉంది.
U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్ సాధించిన మహిళలు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..
Published date : 31 Jan 2023 03:40PM