Skip to main content

Shubman Gill Double Century : పరుగుల సునామీ.. డబుల్‌ సెంచరీ చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు..

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జనవరి 18వ తేదీ (బుధ‌వారం) జ‌రిగిన‌ తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 149 బంతుల్లో 208 ప‌రుగులు చేశాడు. 19 ఫోర్లు, 9 సిక్సర్లుల‌తో డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
Shubman Gill
Shubman Gill 200 Runs

ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్‌.. వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గిల్‌ విధ్వంసం ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

Virat Kohli Records : ప్రపంచ క్రికెట్‌లో చ‌రిత్ర‌లో ఏకైక ఆటగాడిగా కోహ్లి.. సాధించిన అరుదైన రికార్డులు ఇవే..
  
ఐదో భారత క్రికెటర్‌గా..

shubman gill

వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు శుభ్‌మన్‌ గిల్. సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ల తర్వాత గిల్ డబుల్ సెంచరీ ఫీట్‌ని అందుకున్నాడు. వీరిలో రోహిత్‌ శర్మ మూడుసార్లు ‘డబుల్’ సాధించాడు.

Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

అత్యంత పిన్న వయసులోనే రికార్డుల మోత ఇలా..
☛ అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్‌ కిషన్‌ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది.
☛ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో అత్యధిక స్కోర్‌ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది.  
☛ వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్‌ (గిల్‌, 208), రెండో అత్యధిక స్కోరర్‌ (రోహిత్‌, 34) మధ్య మూడో అత్యధిక రన్స్‌ గ్యాప్‌ (174 పరుగులు). ఈ రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్‌ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా విరాట్‌ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరగుల తేడా ఉంది.
☛ వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. గతంలో ఈ రికార్డు సచిన్‌ (186 నాటౌట్‌) పేరిట ఉండేది.
☛ వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్‌ సెంచరీతో పాటు హ్యాట్రిక్‌ సిక్సర్లతో డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన ఘనత.
☛ అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్‌ ధవన్‌ (17) తర్వాతి స్థానం. 
☛ వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్‌ ఆటగాడు ఫకర్‌ జమాన్‌ (18) పేరిట​ ఉంది. 
భారత్‌ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధవన్‌ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు.

Published date : 18 Jan 2023 06:40PM

Photo Stories