Skip to main content

Sarath Chandra Reddy: ఏసీఏ అధ్యక్షుడిగా శరత్‌ చంద్రారెడ్డి

మాజీ ఐఏఎస్‌ రమాకాంత్‌ రెడ్డి ఎన్నికల అధికారిగా నవంబర్‌ 18న ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఎన్నికలను నిర్వహించారు.

ఇందులో ఆరు కీలక పదవుల కోసం ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అధ్యక్షుడిగా పి.శరత్‌ చంద్రారెడ్డి, ఉపాధ్యాక్షుడిగా పి.రోహిత్‌ రెడ్డి, కార్యదర్శిగా గోపీనాథ్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎ.రాకేశ్‌, కోశాధికారిగా ఎ.వెంకటాచలం, కౌన్సిలర్‌గా కేవీ పురుషోత్తమ రావు ఎన్నికయ్యారు.

➤ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

Published date : 15 Dec 2022 06:08PM

Photo Stories