Skip to main content

Badminton: స్విస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?

PV Sindhu

స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌–2022లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా అవతరించింది. 2021 ఏడాది కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన 26 ఏళ్ల సింధు ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. స్విట్జర్‌ల్యాండ్‌లోని బాసెల్‌ నగరం వేదికగా మార్చి 27న జరిగిన మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. విజేతగా నిలిచిన సింధుకు 13,500 డాలర్ల (రూ. 10 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7,000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 2022 ఏడాది సింధుకిది రెండో టైటిల్‌. గత జనవరిలో ఆమె సయ్యద్‌ మోదీ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచింది.

Football: ఐఎస్‌ఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న జట్టు?

నాలుగో భారత ప్లేయర్‌..
స్విస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా సింధు నిలిచింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ (2011, 2012) రెండుసార్లు టైటిల్‌ నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ (2015), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (2016) విజేతగా నిలిచారు.

రన్నరప్‌గా ప్రణయ్‌..
స్విస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్, 2016 చాంపియన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రన్నరప్‌గా నిలిచాడు. కేరళకు చెందిన ప్రణయ్‌ ఫైనల్లో 12–21, 18–21తో 2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో  ఓడిపోయాడు.

Men's Doubles Title: భారత క్రీడాకారుడు సాకేత్‌ మైనేని ఏ క్రీడలో ప్రసిద్ధుడు?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌–2022 మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు
ఎక్కడ : బాసెల్, స్విట్జర్‌ల్యాండ్‌
ఎందుకు : మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Mar 2022 04:31PM

Photo Stories