ICC Awards 2021: క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైన క్రికెటర్?
పురుషుల విభాగంలో ‘సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్’ పేరిట అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇచ్చే ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది ఎంపికయ్యాడు. 2021 ఏడాదికిగాను అఫ్రిదిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీసీ జనవరి 24న ప్రకటించింది. క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకుగాను అఫ్రిదికి ఈ అవార్డు దక్కింది. 2021 ఏడాది అతను 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 22.20 సగటుతో 78 వికెట్లు పడగొట్టాడు. 6/51 అఫ్రిది అత్యుత్తమ ప్రదర్శన.
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్..
2021 ఏడాది అత్యుత్తమ వన్డే, టి20 క్రికెటర్ అవార్డులు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకే లభించాయి. 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ ఆజమ్ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా... 29 టి20ల్లో 73.66 సగటుతో 1,326 పరుగులు చేసి 24 వికెట్ల పతనంలో పాలు పంచుకున్న కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యారు. ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్‌కు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన రూట్ 15 టెస్టుల్లో 61 సగటుతో 1,708 పరుగులు సాధించాడు.
చదవండి: క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం–2021కు ఎంపికైన క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది
ఎందుకు : క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకుగాను..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్