Skip to main content

Nikhat Zareen: మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ఎక్కడ జరిగింది?

Nikhat Zareen

తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హరియాణలోని హిసార్‌లో అక్టోబర్‌ 27న ముగిసిన ఈ ఈవెంట్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్‌ 52 కేజీల విభాగం ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచి, పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్‌కు టోర్నీ ‘బెస్ట్‌ బాక్సర్‌’ పురస్కారం కూడా లభించింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన బాక్సర్లు.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ ప్రకారం 2021, డిసెంబర్‌లో టర్కీలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీ పడేందుకు నిఖత్‌ అర్హత సాధించింది.

చ‌ద‌వండి: ఖేల్‌రత్న అవార్డుకు ఎవరి పేర్లను సిఫార్సు చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న క్రీడాకారిణి?
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : నిఖత్‌ జరీన్‌
ఎక్కడ : హిసార్, హరియాణ
ఎందుకు : 52 కేజీల విభాగం ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచినందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Oct 2021 07:33PM

Photo Stories