Skip to main content

World Championships 2022: ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో మెరిసిన మీరాబాయి చాను

భారత స్టార్‌ మహిళా వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది.
Mirabai Chanu

డిసెంబర్‌ 7న బొగోటా (కొలంబియా)లో జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్‌ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది.  
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు),  కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు. 

World Boxing Championships: బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు

Published date : 08 Dec 2022 01:39PM

Photo Stories