Skip to main content

Daniel Ricciardo: ఇటలీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌?

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసు ఇటలీ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో చాంపియన్‌గా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్‌ 12న జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో 53 ల్యాప్‌ల దూరాన్ని రికియార్డో అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని విజేతగా అవతరించాడు.
Daniel Ricciardo

1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్‌ (మెర్సిడెస్‌) నిలిచాడు. 2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్‌1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. అలాగే 2012 బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి తర్వాత మళ్లీ మెక్‌లారెన్‌ జట్టు ఒక ఎఫ్‌1 రేసులో గెలవడం ఇదే మొదటిసారి.

రామ్‌–బాలాజీ జంటకు టైటిల్‌

ఏటీపీ కసీస్‌ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో రామ్‌కుమార్‌ రామనాథన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట టైటిల్‌ గెలిచింది. ఫ్రాన్స్‌లోని కసీస్‌లో సెప్టెంబర్‌ 11న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రామ్‌కుమార్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 6–4, 3–6, 10–6తో హన్స్‌ హచ్‌ వెర్డుగో–మిగుయెల్‌ వరేలా (మెక్సికో) జంటపై విజయం సాధించింది.

 

చ‌దవండి: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారతీయురాలు?

 

శ్రీలంక జట్టు కెప్టెన్‌గా షనక

2021 అక్టోబర్‌లో ఒమన్, యూఏఈలో జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే శ్రీలంక క్రికెట్‌ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకు దసున్‌ షనక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇటలీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 12
ఎవరు    : మెక్‌లారెన్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో
ఎక్కడ    : మోంజా, ఇటలీ
ఎందుకు : ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో 53 ల్యాప్‌ల దూరాన్ని రికియార్డో అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచినందున...
 

 

Published date : 13 Sep 2021 05:25PM

Photo Stories