వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కిడాంబి శ్రీకాంత్
స్పెయిన్ నుంచి స్వస్థలం తిరిగొచి్చన అనంతరం డిసెంబర్ 21వ తేదీన గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడాడు.
వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతకంపై...
ఎవరికైనా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం ఎంతో ప్రత్యేకం. నాకూ చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి పెద్ద టోరీ్నలో విజయం అంత సులువుగా దక్కదు. విజేతగా నిలవకపోయినా ఫైనల్ ఆడటం కూడా ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నా. 2017లోనే పతకం గెలుస్తానని భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం కూడా మేలు చేసింది.
తిరిగి టాప్-10లోకి..
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్(17)ను అందుకోగా, హెచ్‌ఎస్ ప్రణయ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.