Skip to main content

IPL Champion 2022 : ఐపీఎల్‌ చాంపియన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ ∙

తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచిన ఘనత ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్‌ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్‌ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు.
IPL Champion 2022

 మే 29 (ఆదివారం) జరిగిన ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌–2022 విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా,  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 45 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  

 

ఐపీఎల్‌–2022 అవార్డులు

  • ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌) జోస్‌ బట్లర్‌ (రాజస్తాన్‌; 863) 


ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

  • పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌  బట్లర్‌ (రాజస్తాన్‌)

 ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

  • అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌ బట్లర్‌ (రాజస్తాన్‌; 45)

ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

  • మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ బట్లర్‌ (రాజస్తాన్‌)  

ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

  • గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌ బట్లర్‌ (రాజస్తాన్‌)

ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

  • పర్పుల్‌ క్యాప్‌ – (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌)  -- చహల్‌ (రాజస్తాన్‌; 27)

ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

  • ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ ఉమ్రాన్‌ మలిక్‌ (హైదరాబాద్‌) 


ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

  • పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ ఇవిన్‌ లూయిస్‌ (లక్నో)  


ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

  • సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌  దినేశ్‌ కార్తీక్‌ (బెంగళూరు) 

ప్రైజ్‌మనీ: టాటా పంచ్‌ కారు 

‘ఫెయిర్‌ ప్లే’ ఆఫ్‌ ద సీజన్‌:  గుజరాత్, రాజస్తాన్‌

  • మొత్తం ఫోర్లు: 2017 
  • మొత్తం సిక్స్‌లు: 1062
Published date : 30 May 2022 04:23PM

Photo Stories