Skip to main content

SAFF 2021: శాఫ్‌ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదోసారి విజేతగా నిలిచిన జట్టు?

Sunil Chhetri

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. మాల్దీవుల రాజధాని మాలీలో అక్టోబర్‌ 16న జరిగిన ఫైనల్లో సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 3–0 గోల్స్‌ తేడాతో నేపాల్‌ జట్టుపై గెలిచింది. భారత్‌ తరఫున సునీల్‌ ఛెత్రి, సురేశ్‌ సింగ్, అబ్దుల్‌ సమద్‌ ఒక్కో గోల్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో సునీల్‌ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్‌ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్‌)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌–115 గోల్స్‌) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

సౌరాష్ట్ర క్రికెటర్‌ అవి బరోట్‌ హఠాన్మరణం


భారత అండర్‌–19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, సౌరాష్ట్ర రంజీ ప్లేయర్‌ అవి బరోట్‌(29) మరణించాడు. అక్టోబర్‌ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందాడు. బరోట్‌ తన కెరీర్‌లో 38 ఫస్ట్‌క్లాస్, 38 లిస్ట్‌ ‘ఎ’, 20 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2019–20 రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన సౌరాష్ట్ర  జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. 2011లో అండర్‌–19 భారత జట్టుకు సారథిగా కూడా బరోట్‌ వ్యవహరించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) చాంపియన్‌షిప్‌–2021లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు   : అక్టోబర్‌ 16
ఎవరు    : భారత జట్టు
ఎక్కడ    : మాలీ, మాల్దీవులు
ఎందుకు : ఫైనల్లో సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 3–0 గోల్స్‌ తేడాతో నేపాల్‌ జట్టుపై గెలవడంతో...

చ‌ద‌వండి: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో విజేతగా నిలిచిన జట్టు?

 

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

 

Published date : 18 Oct 2021 02:52PM

Photo Stories