India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో వన్డే..
శనివారం సాయంత్రం 7:00 గంటలకు విండీస్-భారత్ మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా తమ జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలిని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్.. ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది .
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు బెంచ్‌కే పరిమితమైన జయదేవ్ ఉనద్కట్, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు ఈ మ్యాచ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్‌ను పక్కన పెట్టే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
తొలి వన్డేలో విరాట్ కోహ్లి స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలో మాత్రం తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని నిర్ఱయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్రాన్ కూడా తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు.
☛☛ Ravindra Jadeja breaks Kapil Dev Record: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు
తొలి వన్డేలో 3 ఓవర్లు బౌలింగ్ వేసిన ఉమ్రాన్ మాలిక్ 17 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. భారత బౌలింగ్ విభాగంలో అతడు మినహా మిగితా బౌలర్లందరూ కనీసం ఒక్క వికెట్ అయినా సాధించారు. దీంతో రెండో వన్డేకు ఉమ్రాన్‌ను కూడా పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్ కూడా తమ జట్టులో కీలక మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
తుది జట్లు(అంచనా)భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, జోషఫ్ యానిక్ కారియా, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.
☛☛ India create World record in Test history: చరిత్ర సృష్టించిన టీమిండియా