India vs Australia : 141 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్పిన్ సంచలనం
అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన 22 ఏళ్ల మర్ఫీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది.
➤ Suryakumar Yadav : సరికొత్త చరిత్ర.. భారతీయ తొలి ఆటగాడిగా సూర్యకుమార్ అరుదైన రికార్డు
ప్లామర్ 1882లో ఇంగ్లండ్‌తో జరగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 22 ఏళ్ల 360 రోజుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇక 22 ఏళ్ల 87 రోజుల వయస్సులోనే ఈ ఘనతను సాధించిన మర్ఫీ.. 141 ఏళ్ల ప్లామర్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో రికార్డును మర్ఫీ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్కాట్ బొలాండ్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్ ఉన్నారు.
Team India Players : ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈతనే..