ICC Rankings: తొలి సారి అగ్రస్థానానికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్నస్ లబుషేన్
Sakshi Education
ఐసీసీ పురుషుల టెస్టు బ్యాటర్ తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబుషేన్ నంబర్‌వన్‌గా నిలిచాడు.
912 రేటింగ్ పాయింట్లు సాధించిన లబుషేన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో రాణించడంతో లబుషేన్‌కు టాప్ ర్యాంక్ సాధ్యమైంది. జో రూట్ (897) రెండో స్థానానికి పడిపోగా, టాప్–10లో రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (7) ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఆర్.అశ్విన్ రెండో స్థానంలో, ఆల్‌రౌండర్లలో అశ్విన్ రెండో, జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Published date : 23 Dec 2021 05:15PM