Skip to main content

Hockey: ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

ఒడిశాలో జ‌న‌వ‌రి 13 నుంచి 29 వరకు జరిగే పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు.

18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్‌ డిఫెండర్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా.. అమిత్‌ రోహిదాస్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్‌ ‘డి’లో ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్‌లతో కలిసి భారత జట్టు ఉంది. 
భారత హాకీ జట్టు: శ్రీజేశ్, కృషన్‌ పాఠక్‌ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, సురేందర్, వరుణ్, నీలం సంజీప్‌ జెస్, మన్‌ప్రీత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, ఆకాశ్‌దీప్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్, అభిõÙక్, సుఖ్‌జీత్‌ సింగ్‌.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Published date : 24 Dec 2022 12:30PM

Photo Stories