Skip to main content

Gurunaidu: వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన గురు

జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శనపతి గురునాయుడు స్వర్ణ పతకాన్ని సాధించాడు.

డిసెంబ‌ర్ 30న‌ జరిగిన యూత్ పురుషుల 55 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురు నాయుడు మొత్తం 233 కేజీలు (స్నాచ్లో 104+క్లీన్ అండ్ జెర్క్లో 129) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గురునాయుడు 55 కేజీల విభాగంలో మొత్తం 230 కేజీలు బరువెత్తి బంగారు పతకం సాధించాడు. తాజాగా జాతీయ టోర్నీలో అతను అదనంగా మరో మూడు కేజీలు ఎక్కువ బరువెత్తడం విశేషం.  

Women's National Boxing Championships: నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌

Published date : 03 Jan 2023 06:29PM

Photo Stories