Formula 1 Race: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
2022 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా మార్చి 28న జరిగిన ఈ రేసులో.. 50 ల్యాప్‌ల ప్రధాన రేసును 24 ఏళ్ల వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 19.293 సెకన్లలో పూర్తి చేసి తన కెరీర్‌లో 21వ విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ రెండో స్థానంలో నిలువగా... కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 10న జరుగుతుంది.
Badminton: స్విస్ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : జెద్దా, సౌదీ అరేబియా
ఎందుకు : 50 ల్యాప్‌ల ప్రధాన రేసును 24 ఏళ్ల వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 19.293 సెకన్లలో పూర్తి చేసినందున..
Chess: ఢిల్లీ ఓపెన్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన ఆటగాడు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్