Skip to main content

ఏప్రిల్ 2017 అవార్డ్స్

జీఎన్ రావుకు యుధ్‌వీర్ అవార్డు
ప్రతిష్టాత్మక యుధ్‌వీర్ అవార్డు - 2017కు ఎల్వీ ప్రసాద్ నేత్ర చికిత్సాలయం చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు ఎంపికయ్యారు. నేత్ర చికిత్సలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యుధ్‌వీర్ ఫౌండేషన్ ఏప్రిల్ 26న ప్రకటించింది. స్వాతంత్య్ర సమర యోధుడు, హిందీ మిలాప్ వ్యవస్థాపక సంపాదకుడు, దివంగత యుధ్‌వీర్ స్మారకార్థం గత 26 ఏళ్లుగా వివిధ రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
యుధ్‌వీర్ అవార్డు - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : గుళ్లపల్లి ఎన్.రావు
ఎందుకు : వైద్య రంగంలో అందించిన సేవలకు గాను

ఆంధ్రప్రదేశ్ నంది టీవీ అవార్డులు 2012, 2013
2012, 2013 సంవత్సరాలకు నంది టీవీ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 26న ప్రకటించింది. 2012కు సంబంధించి తొమ్మిది విభాగాల్లో 99 ఎంట్రీలు, 2013కు 104 ఎంట్రీలు వచ్చాయని.. వీటిని పరిశీలించి ఉత్తమంగా ఉన్న వాటికి అవార్డులు ప్రకటించామని జ్యూరీ ప్రతినిధులు వెల్లడించారు.
2012 అవార్డులు
ప్రథమ ఉత్తమ టెలిఫిల్మ్ - ఇంద్రజిత్
ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్ - శ్రీ శ్రీకురుస చరితం
ప్రథమ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - ఎందరో మహానుభావులు
ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - శస్త్ర
ప్రథమ ఉత్తమ మెగా సీరియల్ - పండు మిరపకాయ
ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్ - వీరభీమ్
ప్రథమ ఉత్తమ డైలీ సీరియల్ - కాంచనగంగ
ఉత్తమ డెరైక్టర్ - కేవీ రెడ్డి (కుంకుమరేఖ)
ఉత్తమ నటుడు - అనిల్ (మనసు - మమత)
ఉత్తమ నటి - భావన (కాంచనగంగ)
ఉత్తమ సహాయ నటుడు - మేకా రామకృష్ణ (అంతఃపురం)
ఉత్తమ సహాయనటి - రాగిని (పండుమిరపకాయ)
ఉత్తమ హాస్య నటుడు - శ్రీరామమూర్తి (విద్యాదానం)

2013 అవార్డులు
ప్రథమ ఉత్తమ టెలిఫిల్మ్ - గోదా కల్యాణం
ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్ - సతీసావిత్రి
ప్రథమ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - సుఖీభవ
ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - బ్లాక్ త్రీ
ప్రథమ ఉత్తమ మెగా సీరియల్ - పురాణగాథలు
ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్ - శ్రీ సద్గురు సారుు లీలలు
ప్రథమ ఉత్తమ డైలీ సీరియల్ - పుట్టింటి పట్టుచీర
ద్వితీయ ఉత్తమ డైలీ సీరియల్ - మంగమ్మగారి మనువరాలు
ఉత్తమ డెరైక్టర్ - రాధాకృష్ణ (స్వాతి చినుకులు)
ఉత్తమ నటుడు - ప్రీతం (మనసు - మమత)
ఉత్తమ నటి - యామిని (పుట్టింటి పట్టుచీర)
ఉత్తమ సహాయ నటుడు - సమ్మెట గాంధీ (పుట్టింటి పట్టుచీర)
ఉత్తమ సహాయ నటి -పియదర్శిని (మంగమ్మగారి మనువరాలు)
ఉత్తమ హాస్య నటుడు - విశ్వేశ్వర్ (గంగతో రాంబాబు)
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ నంది టీవీ అవార్డులు
ఎప్పుడు : 2012, 2013
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఆయా సంవత్సరాల్లో ఉత్తమ టీవీ సీరియళ్లు, ప్రోగ్రామ్స్‌కు

పద్మ వెంకట్రామన్‌కు అవయ్యార్ పురస్కారం
తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే అవయ్యార్ పురస్కారానికి ప్రముఖ సామాజిక కార్యకర్త, ఉమెన్స్‌ ఇండియా అసోసియేషన్ చైర్‌పర్సన్ పద్మ వెంకట్రామన్ ఎంపికయ్యారు. మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ కూతురైన పద్మ గత మూడు దశాబ్దాలుగా మహిళా సంక్షేమం, పునరావాసంతో పాటు కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి సేవలందిస్తున్నారు. అవార్డు కింద లక్ష రూపాయల చెక్కుతోపాటు 8 గ్రాముల స్వర్ణపతకాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
అవయ్యార్ పురస్కారం
ఎప్పుడు : మే 2
ఎవరు : పద్మా వెంకటరామన్
ఎక్కడ : తమిళనాడు
ఎందుకు : మహిళా సంక్షేమం, పునరావాసం కోసం చేసిన కృషికి

కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Current Affairs
ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌కు 2016వ సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ మేరకు ఫాల్కే అవార్డు కమిటీ ఏప్రిల్ 24న ప్రకటించింది. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే 48వ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు, శాలువాతో సత్కరిస్తారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందిస్తుంది.
1930లో గుడివాడలో జన్మించిన కె. విశ్వవనాథ్ 1965 నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు రూపొందించారు. 1992లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఐదు జాతీయ అవార్డులు, 20 నంది అవార్డులు, 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - 2016
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : దర్శకుడు కె. విశ్వనాథ్
ఎందుకు : సినిమా రంగానికి అందించిన సేవలకు గాను

ఆమిర్‌ఖాన్, కపిల్‌దేవ్‌లకు దీననాథ్ పురస్కారాలు
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌లు ప్రతిష్టాత్మక దీననాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. దంగల్ సినిమాలో నటనకుగాను ఆమిర్‌ను, భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను కపిల్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు హృదయేశ్ ఆర్‌‌ట్స సంస్థ ఏప్రిల్ 20న ప్రకటించింది. దీంతోపాటు మాస్టర్ దీననాథ్ విశేష్ పురస్కారానికి ప్రముఖ నటి వైజయంతి బాలి, మోహన్ వాఘ్ అవార్డుకు సునీల్ బార్వేను ఎంపిక చేసినట్లు తెలిపింది. కళలు, క్రీడా, రంగస్థల, సాహిత్య రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి హృదయేశ్ ఆర్ట్స్ సంస్థ ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీననాథ్ మంగేష్కర్ పురస్కారాలు - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : హృదయేశ్ ఆర్ట్స్ సంస్థ
ఎందుకు : కళలు, క్రీడా, రంగస్థల, సాహిత్య రంగాల్లో విశేష ప్రతిభకు

ప్రఫుల్ల సమంతారాకు గోల్డ్‌మెన్ ప్రైజ్
ఒడిశాకు చెందిన పర్యావరణ వేత్త ప్రఫుల్ల సమంతార ఆసియా గోల్డ్ మెన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ - 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు గోల్డ్ మెన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ఏప్రిల్ 24న ప్రకటించింది. సమంతార ఒడిశాలోని డొంగిరియా కొండ్ తెగ ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాడారు. అలాగే నియమగిరి కొండల్లో మైనింగ్‌కు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది. గోల్డ్‌మెన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ ను గ్రీన్ నోబెల్‌గా పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డ్‌మెన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ప్రఫుల్ల సమంతార
ఎక్కడ : ఆసియా ప్రాంతానికి
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడినందుకు

గుళ్లపల్లి ఎన్.రావుకు యుధ్‌వీర్ అవార్డు
వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి (హైదరాబాద్) వ్యవస్థాపకుడు గుళ్లపల్లి ఎన్.రావుకు 26వ యుధ్‌వీర్ స్మారక పురస్కారం లభించింది.

అనిరుధన్ వాసుదేవన్‌కు సాహిత్య అకాడమీ అవార్డు
అనిరుధన్ వాసుదేవన్ ఆంగ్లానువాదం ‘వన్ పార్ట్ ఉమెన్’కు 2016 సంవత్సరానికి ఏప్రిల్ 19న సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అనువాదంలో ఆయనను ఎంపిక చేశారు. వన్ పార్ట్ ఉమెన్.. పెరుమాళ్ మురుగన్ రచించిన వివాదాస్పద తమిళ నవల మథోరుబాగన్‌కు ఆంగ్లానువాదం.

భారత మహిళకు సింగపూర్ అవార్డ్
భారత ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్.. తృప్తి జైన్ ఏప్రిల్ 15న సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక కార్టియర్ ఉమెన్ ఇనిషియేటివ్ అవార్డ్ అందుకున్నారు. వరదలు, కరువు పరిస్థితుల బారి నుంచి రైతులను ఆదుకునేందుకు వీలుగా నీటి నిర్వహణ మార్గాలు అందించడంతోపాటు వాటిలో మహిళలను భాగస్వామ్యం చేసినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది.

కందుకూరి రంగస్థల పురస్కారాలు
2017కు గానూ రాష్ట్ర స్థాయి కందుకూరి రంగ స్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని, జిల్లాకు ఐదుగురి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. కర్నాటి లక్ష్మీనరసయ్య, చింతా కబీరదాస్, అగ్గరపుల రజనీబాయిలు రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపిక య్యారు. రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం, జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలకు రూ.10,000 ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు.

64వ జాతీయ సినీ అవార్డులు
Current Affairs
64వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 7న ప్రకటించింది. ఇందులో మరాఠీ భాషలో తెరకెక్కిన కాసవ్ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా ‘రుస్తుం’లో నటనకుగాను అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని దక్కించుకున్నారు. మలయాళ సినిమా ‘మిన్నా మినుంగు’లో నటనగాను సురభీ లక్ష్మి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పురస్కారం శతమానం భవతి సినిమాను వరించింది. పెళ్లిచూపులు సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ సంభాషణల అవార్డు గెలుచుకుంది. కొరియోగ్రఫీ, ప్రత్యేక జ్యూరీ (మోహన్‌లాల్) విభాగంలో జనతా గ్యారేజ్ సినిమాకు అవార్డులు దక్కాయి.
అవార్డుల విజేతలు
ఉత్తమ చిత్రం :
కాసవ్ ( మరాఠీ )
ఉత్తమ నటుడు : అక్షయ్ కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి : సురభీ లక్ష్మి (మిన్నామినుంగు)
ఉత్తమ దర్శకుడు : రాజేశ్ మాపుస్కర్ (వెంటిలేటర్)
ఉత్తమ సామాజిక చిత్రం : పింక్
ఉత్తమ హిందీ చిత్రం : నీర్జా
ఉత్తమ సహాయ నటుడు : మనోజ్ జోషి (దష్‌క్రియ)
ఉత్తమ సహాయ నటి : జైరా వాసిమ్ (దంగల్)
ఉత్తమ నూతన దర్శకుడు : దీప్ చౌదరి (అలిఫా)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : శతమానం భవతి
ఉత్తమ సంభాషణలు : తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ ఫైట్ మాస్టర్ : పీటర్ హెయిన్స్ (పులి మురుగన్ )
ఉత్తమ కొరియోగ్రాఫర్ : రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ బాలల చిత్రం : ధనక్ (హిందీ)
ఉత్తమ బాల నటులు : అదిష్ ప్రవీణ్ (కుంజు దైవమ్), సాజ్ (నూర్ ఇస్లాం), మనోహర్ (రైల్వే చిల్డ్రన్ )
ఉత్తమ గాయకుడు : సుందర అయ్యర్ ( జోకర్)
ఉత్తమ గాయని : ఇమాన్ చక్రవర్తి ( ప్రకటన్ )
ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) : శ్యామ్ పుష్కరన్ (మహేషింటె ప్రతీకారం’)
ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్) : సంజయ్ కిషన్‌జీ పటేల్(దశక్రియ)
ఉత్తమ ఎడిటింగ్ : రామేశ్వర్ ఎస్. భగత్(వెంటిలేటర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : శివాయ్
ఉత్తమ సౌండ్ డిజైనర్ :జయదేవన్ (కాడు పూక్కున్న నేరమ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ‘24’
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ (సైకిల్’)
ఉత్తమ పర్యావరణ వ్యవసాయిక చిత్రం : ‘ది టైగర్ హూ క్రాస్డ్ ది లేన్’
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : ఎం. రామకృష్ణ
ఉత్తమ సంగీత దర్శకత్వం : బాబు పద్మనాభ (అల్లమ)
సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం : ఉత్తరప్రదేశ్
ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు
పెళ్లి చూపులు (తెలుగు), మడిపూర్ (తుళు), జోకర్ (తమిళ్), రాంగ్ సైడ్ రాజు (గుజరాతీ), రిజర్వేషన్ (కన్నడ), దశక్రియ (మరాఠీ), బిసర్జన్ (బెంగాలీ), మహేషింటె ప్రతీకారం (మలయాళం)
ప్రత్యేక ప్రశంస
కడ్వి హవా (హిందీ), ముక్తి భవన్ (హిందీ), మజిరాతీ కేకి (అస్సామీస్), నీర్జా (సోనమ్ కపూర్)
ప్రత్యేక జ్యూరీ అవార్డు
మోహన్‌లాల్ (‘పులి మురుగన్’, ‘జనతా గ్యారేజ్)
క్విక్ రివ్యూ:
ఏమిటి :
64వ జాతీయ సినీ అవార్డులు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీలో

విజ్డెన్ లీడింగ్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2016లో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) అత్యుత్తమ ప్రదర్శనకు గాను కోహ్లీకి ఈ పురస్కారం దక్కింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్ పెర్రీ ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకుంది. 2017 విజ్డెన్ మ్యాగజైన్ విరాట్ కోహ్లి కవర్‌పేజీతో విడుదలైంది.
విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ పురస్కారాన్ని 2003లో ఏర్పాటు చేయగా తొలి అవార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అందుకున్నాడు. భారత్ నుంచి గతంలో సెహ్వాగ్ (2008, 2009), సచిన్ (2010) ఈ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజ్డెన్ లీడింగ్ క్రికెటర్
ఎప్పుడు : 2016
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎందుకు : 2016లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను

జనార్దన్‌రెడ్డికి ఇన్నోవేటివ్ ఇనీషియేటివ్ అవార్డు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఇన్నోవేటివ్ ఇనీషియేటివ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 8న ‘ఎలీట్స్’ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో జరిగిన ‘స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ సమ్మిట్’లో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ‘చెత్తను వేరు చేద్దాం, కుటుంబాలను కలిపి ఉంచుదాం’ అనే నినాదంతో జీహెచ్‌ఎంసీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమానికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఇన్నోవేటివ్ ఇనీషియేటివ్ అవార్డు-2017
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : జనార్దన్ రెడ్డి
ఎక్కడ : నాగ్‌పూర్
ఎందుకు : జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య చర్యలకు

ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఆశా ఖేమ్కా
భారత సంతతికి చెందిన విద్యావేత్త ఆశా ఖేమ్కా ఏషియన్ బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బర్మింగ్‌హమ్‌లో ఏప్రిల్ 8న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు.
ఆశా ఖేమ్కా మ్యాన్ ఫీల్డ్స్‌లోని వెస్ట్ నాటింగ్‌హమ్‌షైర్ కళాశాలలో అధ్యాపకురాలిగా, సీఈవోగా పనిచేశారు. యూకే ప్రభుత్వం 2014లో ఆమెను ‘Dame Commander of the Order of the British Empire’ తో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఏషియన్ బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ఆశా ఖేమ్కా
ఎక్కడ : బర్మింగ్‌హమ్
ఎందుకు : విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా

ఈసీఐఎల్‌కు స్కోప్ అవార్డు
ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేష కృషి చేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోప్ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 11న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈసీఐఎల్ చైర్మన్ అండ్ ఎండీ దేబాషిస్ దాస్ ఈ అవార్డును అందుకున్నారు.
హైదరాబాద్‌లో ఉన్న ఈసీఐఎల్.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు రూపొందించింది. బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఈసీఐఎల్‌కు స్కోప్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : స్కోప్ ( Standing Conference of Public Enterprises)
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేష కృషికి

పెళ్లిచూపులు సినిమాకు బి.నాగిరెడ్డి పురస్కారం
బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం - 2016కు పెళ్లిచూపులు సినిమా ఎంపికైంది. సమగ్ర వినోద ప్రధాన చిత్రం విభాగంలో ఈ సినిమాను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఏప్రిల్ 12న బి. నాగిరెడ్డి ఫౌండేషన్ ప్రకటించింది. విజయ ప్రొడక్షన్‌‌స ఆధ్వర్యంలో సినీ నిర్మాత బి.నాగిరెడ్డి పేరిట ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బి. నాగిరెడ్డి పురస్కారం - 2016
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : పెళ్లిచూపులు సినిమాకు
ఎందుకు : సమగ్ర వినోద ప్రధాన చిత్రంగా

తెలుగు శాస్త్రవేత్తలకు జియో సైన్‌‌స అవార్డు
తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు మార్కండేయులు, రమేశ్ బాబులకు జియో సైన్‌‌స- 2016 అవార్డులు లభించాయి. ఈ మేరకు ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకున్నారు. 30 ఏళ్లుగా ఖనిజ అన్వేషణ, పరిశోధనా రంగంలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా వీరికి ఈ అవార్డులు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మార్కండేయులు, తెలంగాణకు చెందిన రమేశ్ బాబులు ఏఎండీ (అటామిక్ మినరల్ డెరైక్టరేట్ - అన్వేషణ, పరిశోధన)లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జియో సైన్స్ అవార్డులు - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : మార్కండేయులు, రమేశ్ బాబులకు
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : ఖనిజ అన్వేషణ, పరిశోధనా రంగంలో విశేష కృషికి

జెన్‌కో ఎండీ విజయానంద్‌కు మలేసియా అవార్డు
ఏపీ జెన్‌కో ఎండీ కె.విజయానంద్‌కు అంతర్జాతీయ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ ఆధ్వర్యంలో కౌలాలంపూర్‌లో జరిగిన ఇండో-మలేసియా ఎకనమిక్ కో-ఆపరేషన్ సదస్సులో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఉత్పత్తి నిర్వహణ, కార్పొరేట్ సెక్టార్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ అవార్డులు ఇచ్చినట్లు నిర్వాహక సంస్థ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జెన్‌కో ఎండీ విజయానంద్ అంతర్జాతీయ ఐకాన్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్
ఎక్కడ : కౌలాలంపూర్, మలేసియా
ఎందుకు : మెరుగైన ఉత్పత్తి సాధించినందుకు

కాల్సన్ వైట్‌హెడ్‌కు పులిట్జర్ పురస్కారం
రచయిత కాల్సన్ వైట్‌హెడ్ పులిట్జ్జర్ పురస్కారం - 2017కు ఎంపికయ్యారు. ఆయన రచించిన ఫిక్షన్ నవల "The Underground Railroad" కు గాను ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు అవార్డుల కమిటీ ఏప్రిల్ 10న ప్రకటించింది. బానిసత్వం నుంచి తప్పించుకున్న ఓ యువకుడి జీవితం ఇతివృత్తంగా కాల్సన్ ఈ పుస్తకాన్ని రచించారు. 2016లో విడుదలైన ఈ పుస్తకం నేషనల్ బుక్ అవార్డు కూడా గెలుచుకుంది.
అమెరికాలో సాహిత్యం, పాత్రికేయం, సంగీత రంగాల్లో ఉత్తమ ప్రతిభకు పులిట్జర్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పులిట్జర్ పురస్కారం - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : కాల్సన్ వైట్‌హెడ్
ఎక్కడ : అమెరికా
ఎందుకు : ఫిక్షన్ నవల "The Underground Railroad"కు గాను

ఐఫా అవార్డులు - 2017
Current Affairs
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) - 2017 వేడుకలు హైదరాబాద్‌లో మార్చి 29న జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఐఫా తెలుగు సినిమా అవార్డులు అందజేసింది. జనతా గ్యారేజ్ చిత్రానికి గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా ఆ.. ఆ.. చిత్రానికి సమంత ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
అవార్డు గ్రహీతలు
ఉత్తమ సినిమా :
జనతా గ్యారేజ్
ఉత్తమ కథ : కంచె - క్రిష్
ఉత్తమ దర్శకుడు : కొరటాల శివ - జనతా గ్యారేజ్
ఉత్తమ నటుడు : జూనియర్ ఎన్టీఆర్ - జనతా గ్యారేజ్
ఉత్తమ నటి : సమంత - ఆ.. ఆ..
ఉత్తమ సహాయ నటుడు : అల్లు అర్జున్ - రుద్రమదేవి
ఉత్తమ సహాయ నటి : అనుపమ పరమేశ్వరన్ - ప్రేమమ్
ఉత్తమ హాస్యనటి : ప్రియ దర్శి - పెళ్లి చూపులు
ఉత్తమ విలన్ : జగపతి బాబు - నాన్నకు ప్రేమతో
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీశ్రీ ప్రసాద్ - జనతా గ్యారేజ్
ఉత్తమ గాయకుడు : హరిచరణ్ శేషాద్రి (నువ్వంటే నా నవ్వు - కృష్ణగాడి వీరప్రేమ గాథ)
ఉత్తమ గాయని : గీతా మాధురి (పక్కా లోకల్ - జనతా గ్యారేజ్)
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐఫా అవార్డులు - 2017
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ
ఎక్కడ : హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ జాతీయ చలనచిత్ర అవార్డులు 2017
2012, 2013 సంవత్సరాలకు జాతీయ, రాష్ట్రీయ చలనచిత్ర అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 4న ప్రకటించింది. త్వరలోనే 2014, 2015, 2016 సంవత్సరాల నంది అవార్డులను ప్రకటిస్తామని పేర్కొన్న ప్రభుత్వం అన్ని పురస్కారాలను ఒకే వేదికపై అందిస్తామని వెల్లడించింది.
2012 అవార్డులు
ఎన్‌టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు :
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం( గాయకుడు)
బీఎన్‌రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డు : సింగీతం శ్రీనివాసరావు(దర్శకుడు)
నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు :డి. సురేశ్ (నిర్మాత)
రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు :కోడి రామకృష్ణ (దర్శకుడు)

2013 అవార్డులు
ఎన్‌టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు :
హేమ మాలిని ( నటి)
బీఎన్‌రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డు :కోదండ రామిరెడ్డి (దర్శకుడు)
నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు : దిల్ రాజు (నిర్మాత)
రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు :వాణిశ్రీ (నటి)
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జాతీయ, రాష్ట్రీయ చలన చిత్ర అవార్డులు
ఎప్పుడు : 2012, 2013
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

మానస్ మండల్‌కు టెక్నాలజీ లీడర్ షిప్ అవార్డు
డీఆర్‌డీఓ మాజీ శాస్త్రవేత్త మానస్ మండల్ ప్రతిష్టాత్మక టెక్నాలజీ లీడర్ షిప్ అవార్డు - 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 4న కోల్‌కత్తాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. మానస్ మండల్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మానస్ మండల్‌కు టెక్నాలజీ లీడర్ షిప్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : డీఆర్‌డీఓ
ఎందుకు : పరిశోధనల్లో విశేష కృషికి

దావిట్ ఇసాక్‌కు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్
ఎరిట్రీ, స్వీడన్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయుడు దావిట్ ఇసాక్ యూనెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ - 2017కు ఎంపికయ్యారు. ఎరిట్రీ దేశంలో మొదటి స్వతంత్ర పత్రిక అయిన సెటిట్‌లో ఇసాక్ రిపోర్ట్‌గా పనిచేశారు. 2001లో ఆ దేశంలో తలెత్తిన సంక్షోభంపై ఆయన అనేక కథనాలు రాశారు. దీనిపై ఆగ్రహించిన ఎరిట్రీ ప్రభుత్వం ఇసాక్‌ను 2001లో అరెస్టు చేసింది. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. దావిస్ ఇసాక్‌కు స్వీడన్ పౌరసత్వం కూడా ఉంది.
యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్‌ను గిల్లెర్మో కానో ప్రైజ్‌గానూ పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
దావిట్ ఇసాక్‌కు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : యునెస్కో
ఎందుకు : పాత్రికేయ రంగానికి అందించిన సేవలకు గాను
Published date : 08 Apr 2017 12:42PM

Photo Stories