Skip to main content

World Cup Trophy: వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఆవిష్కరించిన దీపికా పదుకునే

Deepika Padukone Unveils FIFA World Cup 2022 Trophy

దోహాలోని లుసైల్‌ స్టేడియంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ మధ్య ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ జరిగిన విషయం తెలిసిందే. థ్రిల్లర్‌లా సాగిన ఆ ఫైనల్లో షూటౌట్‌లో అర్జెంటీనా నెగ్గింది. మెస్సి తన మ్యాజికల్‌ ఆటతీరుతో ఫ్రాన్స్‌ను అదరగొట్టాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. బాలీవుడ్‌ నటి దీపికా పదుకునే ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకువచ్చింది. దీపికాతోపాటు స్పెయిన్‌ మాజీ గోల్‌కీపర్‌ ఇకార్‌ కాసిల్లస్‌ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Dec 2022 05:19PM

Photo Stories