Skip to main content

Chess: కార్ల్‌సన్‌ పై ప్రజ్ఞానంద విజయం

Chess: Indian GM Praggnanandhaa defeats world champion Magnus Carlsen
Chess: Indian GM Praggnanandhaa defeats world champion Magnus Carlsen

Telugu Current Affairs - Sports: చెసబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌ లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ అయిదో రౌండ్లో కార్ల్‌సన్‌ ను ప్రజ్ఞానంద ఓడించాడు. ఆరో రౌండ్లో హరికృష్ణను నిలువరించిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాతి గేమ్‌లో గవిన్‌ జో¯Œన్స్‌ను ఓడించాడు. ఎనిమిదో రౌండ్‌లో గ్విజారో చేతిలో ఓడిపోయాడు. టోర్నీలో ప్రస్తుతం అతడు 12 పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్నాడు. 16 ఏళ్ల ప్రజ్ఞానంద మూడు నెలల కింద కూడా ఆన్‌ లైన్‌ ర్యాపిడ్‌ గేమ్‌లో కార్ల్‌సన్‌ కు షాకిచ్చాడు

ఆనంద్‌కు సూపర్‌బెట్‌ టైటిల్‌
ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ పోలెండ్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే అతడు విజేతగా నిలిచాడు. 

Chessable Masters: 2022లో మాగ్నస్ కార్ల్‌సెన్‌పై ఆర్ ప్రజ్ఞానంద 2వ సారి విజయం

Published date : 31 May 2022 06:11PM

Photo Stories