Asian Fencing Championships: ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భవానీదేవికి కాంస్యం
Sakshi Education
భారత ఫెన్సర్ భవానీదేవి ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. చైనాలోని వూగ్జీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె కాంస్యం సాధించడం ద్వారా ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనతకెక్కింది.
జూన్ 19న జరిగిన సెమీఫైనల్లో (సబ్రే ఈవెంట్) 29 ఏళ్ల భవాని 1415తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జేనబ్ దేబెకొవా చేతిలో తుదికంటా పోరాడి ఓడింది. ఫలితం నిరాశపరిచినా ఆమె శ్రమకు కాంస్య పతకం లభించింది. ఈ టోర్నీలో భారత ఫెన్సర్ సంచలన విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచ్చింది. క్వార్టర్ ఫైనల్లో భవాని 1510తో ప్రపంచ చాంపియన్ ఫెన్సర్ మిసాకి ఎముర (జపాన్)ను కంగుతినిపించింది. మిసాకి గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.
ఈ మేటి ప్రత్యర్థితో గతంలో తలపడిన ప్రతీసారి ఓటమి పాలైన భవానీ ఈ ఈవెంట్‌లో అద్భుత విజయం సాధించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ కూడా అయిన భవాని ప్రిక్వార్టర్స్‌లోనూ తనకన్నా మెరుగైన మూడో సీడ్ ప్రత్యర్థి ఒజాకి సెరి (జపాన్)ని 1511తో ఓడించింది.
Indonesia Open: ఇండోనేసియా ఓపెన్ డబుల్స్ విజేతగా సాత్విక్–చిరాగ్ ద్వయం.. తొలి భారతీయ జోడీగా గుర్తింపు
Published date : 20 Jun 2023 06:15PM