Wrestling: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన ఆటగాడు?
ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022లో భారత యువ రెజ్లర్ దీపక్ పూనియాకు రజత పతకం లభించింది. మంగోలియా రాజధాని నగరం ఉలాన్‌బాటర్ వేదికగా ఏప్రిల్ 24న ముగిసిన ఈ టోర్నీ 86 కేజీల విభాగం ఫైనలో 23 ఏళ్ల దీపక్ 1–6తో అజామత్ దౌలత్‌బెకోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయి.. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో దీపక్‌కిది నాలుగో పతకం. 2021లోనూ రజతం నెగ్గిన దీపక్, 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు.
GK Important Dates Quiz: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు?
మరోవైపు 92 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన విక్కీ కాంస్య పతకం గెలిచాడు. 61 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మంగళ్ (భారత్) 4–6తో ఉలుక్‌బెక్ (కిర్గిజిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్‌కు మొత్తం 17 పతకాలు లభించాయి.
Archery: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత జోడీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022లో రజతం గెలిచిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : భారత యువ రెజ్లర్ దీపక్ పూనియా
ఎక్కడ : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : 86 కేజీల విభాగం ఫైనలో 23 ఏళ్ల దీపక్ 1–6తో అజామత్ దౌలత్‌బెకోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్