Asian Games 2023: షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం
Sakshi Education
భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత షూటర్లు నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నారు.
Asian Games 2023
పోటీల ఐదో రోజు గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా, సరబ్‌జోత్ సింగ్‌లతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం సంపాదించి పసిడి పతకం గెల్చుకుంది.
క్వాలిఫయింగ్‌లో భారత జట్టు మొత్తం 1734 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరబ్‌జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లు స్కోరు చేశారు. సరబ్‌జోత్ ఐదో స్థానంలో, అర్జున్ సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌కు అర్హత సాధించారు.