Starship: స్పేస్ఎక్స్ ప్రయోగం విఫలం.. గాల్లోనే పేలిపోయిన అతిపెద్ద రాకెట్
ప్రపంచంలోనే అతి పెద్ద రాకెట్‘స్టార్‌షిప్’ ప్రయోగం విఫలమైంది. ఆకాశంలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాలకే గాలిలోనే రాకెట్‌పేలిపోయింది. చంద్రుడు, అంగారక యాత్ర కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌సంస్థ టెస్ట్‌ఫ్లైట్‌గా ఈ రాకెట్ ప్రయోగం చేపట్టింది. ఇటీవల దీన్ని ప్రయోగించేందుకు కసరత్తు చేసినా సాంకేతిక లోపంతో నిర్ణీత సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపేశారు. అమెరికాలోని టెక్సాస్‌లోని బొకాచికా ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్ ఆకాశంలోకి వెళ్లిన 3 నిమిషాలకు బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్ వేరు కావాలి. కానీ, వేరు కాకపోవడంతో శాస్త్రవేత్తలు ఏదో లోపం జరిగిందని గుర్తించేలోగానే రాకెట్ పేలిపోయింది. ఈ సమయంలో ఆకాశంలో భారీగా మంటలు వ్యాపించాయి. కాగా, ఈ ప్రయోగం నుంచి పాఠాలు నేర్చుకుంటామని, త్వరలోనే మరోసారి ప్రయోగం చేపడతామని స్పేస్‌ఎక్స్‌ప్రకటించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP