Ballistic Missile: సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఆసియా దేశం?
ఉత్తర కొరియా రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు రెండు చేయడంతో.. దక్షిణ కొరియా దానికి పోటీగా ఏకంగా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసింది. దీంతో జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్ ‘‘అహ్ చంగ్ హో’’ ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 వేల టన్నుల బరువున్న సబ్‌మెరైన్ నుంచి నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి కచ్చితంగా ఛేదించింది. కాగా, ఇదిలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని ఉత్తరకొరియా అధినేత కిమ్ సోదరి యో జాంగ్ హెచ్చరించారు.
చదవండి: అధునాతన నౌక ఐసీజీఎస్ విగ్రహను తయారు చేసిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సబ్‌మెరైన్ ‘‘అహ్ చంగ్ హో’’ ద్వారా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఆసియా దేశం?
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : దక్షిణ కొరియా
ఎందుకు : ఉత్తర కొరియా నిర్వహించిన రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలకు పోటీగా...