Electric vehicle: వేగంగా బ్యాటరీ ఛార్జింగ్.. సరికొత్త యానోడ్ పదార్థం సిద్ధం
Sakshi Education
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విద్యుత్ వాహనాలను అత్యంత వేగంగా ఛార్జ్ చేసేందుకు మార్గం సుగమం కానుంది.
ఈ దిశగా గాంధీనగర్‌లోని ఐఐటీ, జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు కొత్త యానోడ్ పదార్థాన్ని రూపొందించారు. లిథియం బ్యాటరీలను నిమిషాల్లోనే రీఛార్జ్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. టైటానియం డైబోరైడ్‌తో రూపొందిన నానోఫలకాలతో ఈ 2డీ యానోడ్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. పెద్దగా సాధన సంపత్తి అవసరం లేకుండానే ఈ పదార్థాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 11 Nov 2022 05:34PM