AY.4.2 Spreads: ఏవై.4.2 అనేది ఏ వ్యాధికి సంబంధించిన వైరస్?
కోవిడ్-19 వైరస్కి సంబంధించి... డెల్టా వేరియెంట్ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యునైటెడ్ కింగ్డమ్(యూకే), అమెరికా, రష్యా, ఇజ్రాయెల్లో ఏవై.4.2 కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2020, అక్టోబర్లో తొలిసారిగా భారత్లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. వీటిలో ఏవై.4.2 మినహా మిగిలినవన్నీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. ఏవై.4.2 వేరియంట్ తొలి సారిగా 2021, జూలైలో యూకేలో బయటపడింది. కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టిందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
యూనియన్ బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎండీ)గా రజనీష్ కర్ణాటక అక్టోబర్ 22న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికి దాకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. బ్యాంకింగ్ రంగంలో 27 ఏళ్ల సుధీర్ఘ అనుభవం కలిగిన రజనీష్ డిజిటల్ బ్యాంకింగ్, క్రిడెట్, లార్జ్ కార్పొరేట్, మిడ్ కార్పొరేట్ రుణ విభాగాల్లో పనిచేశారు.
చదవండి: మానవరహిత విమానం ‘అభ్యాస్’ ను పరీక్షించిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...