NASA: చంద్రుడిపై దిగేందుకు 13 ప్రాంతాల గుర్తింపు
Sakshi Education
చంద్రుడిపై వ్యోమగాములు దిగేందుకు మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది నాసా. త్వరలోనే ఆర్టిమిస్ ఐఐఐ మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపే యోచనలో ఉంది. ఈ అంతరిక్ష నౌక ల్యాండ్ అయ్యేందుకు చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో 13 ప్రాంతాలను గుర్తించింది. చంద్రుడిపై ఆర్టిమిస్ నౌక 6.5 రోజులు ఉంటుంది. ఈ సమయం మొత్తం పగలు ఉండేలా ఈ ప్రాంతాలను గుర్తించారు. చంద్రుడిపై చీకటి చాలా గాఢంగా ఉంటుంది. దానిలో ఏమి ఉన్నా మనకు కనిపించదు. అందుకే సూర్యకాంతి ప్రతినిమిషం ఉండే ప్రాంతాలను నాసా గుర్తించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Sep 2022 04:49PM