Skip to main content

NASA: భూమి కంటే లోతైన సముద్రాలున్న గ్రహాన్ని కనుగొన్న నాసా

NASA has discovered a planet with oceans deeper than Earth

ఈ అనంత విశ్వంలో మరో గ్రహంపై జీవం ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలని చాలా కాలంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మనిషి మనుగడకు నీరు ఎంత ముఖ్యమో.. గ్రహాంతర జీవుల ఉనికికి కూడా నీరు ఒక ముఖ్యమైన సూచికగా భావిస్తున్నారు. ఇటీవల వారి ఆశలకు ఆధారం దొరికినట్లు అయ్యింది. మన భూమిపై ఉన్న సముద్రాల కంటే లోతైన సముద్రాలున్న ఒక ఎక్సో ప్లానెట్‌ను కనుగొన్నారు. ఈ గ్రహాన్ని TOI-1452b గా పిలుస్తున్నారు. ఇది మన గ్రహం నుండి దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.ఈ గ్రహం భూమి కంటే 70శాతం పెద్దది కూడా. ఈ గ్రహం గురించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భూమి ఒకే నక్షత్రం చుట్టూ తిరుగుతుంటే.. ఇది మాత్రం రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం తానున్న నక్షత్ర వ్యవస్థలోని 'గోల్డిలాక్స్‌ జోన్‌'లో ఉన్నట్లు పేర్కొన్నారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Sep 2022 06:24PM

Photo Stories