Electricity: మీథేన్ తినే బ్యాక్టీరియాతో విద్యుత్తు
ప్రకృతిలో లభించే చిన్న బ్యాక్టీరియాతో ఈ ఫలితాన్ని రాబట్టవచ్చని ఫ్రాంటియర్స్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక పేర్కొంది. చెరువులు, కుంటలు, బావులలో లభించే ‘క్యాండిడేటస్ మిథేనో పెరెడిన్స్’ అనే బ్యాక్టీరియాతో పరిశోధనశాలలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది.
ఈ బ్యాక్టీరియా మీథేన్ పదార్థాన్ని తింటూ పెరుగుతుందని పేర్కొంది. భూగర్భజలాలు,ఉపరితల జలాలు నైట్రోజన్ తో కలుషితమైన ప్రదేశాల్లో ఈ బ్యాక్టీరియా లభిస్తుందని తెలిపింది. మీథేన్ ను విచ్ఛిన్నం చేయడానికి నైట్రేట్ అవసరమని వివరించింది.‘బ్యాక్టీరియాలోని సూక్ష్మజీవుల్లో జరిగే మార్పుల ప్రక్రియ గురించి తెలుసుకోవాలని పరిశోధకులు ప్రయత్నించారు. బయోగ్యాస్ ఉత్పత్తి విధానంలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చా అన్నది కూడా తెలుసుకోవాలనుకున్నారు.అదృష్టవశాత్తు వారు ఆ మార్గాన్ని కనుగొన్నారు’అని నివేదిక వివరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP