Liver treatment: కుష్టు బ్యాక్టీరియాతో కాలేయ చికిత్స
Sakshi Education
కుష్టువ్యాధి జటిలమైంది. మనిషి శరీరాన్ని మెల్లమెల్లగా తినేసి జీవచ్ఛవాన్ని మిగిలిస్తుంది. వేళ్లు ఊడిపోతాయి. పక్షవాతం వస్తుంది. అంధత్వమూ కమ్మేస్తుంది.
కానీ ఆ వ్యాధిని కలిగించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం లెప్రేను ఉపయోగించుకొని ఎన్నో కీలకమైన వైద్య ఆవిష్కరణలు చేయొచ్చని అంటున్నారు ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి కాలేయాన్ని పెంచవచ్చని, వృద్ధాప్య లక్షణాలను వెనక్కు నెట్టి పునర్‌యవ్వనాన్ని ప్రసాదించవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Dec 2022 04:26PM