Skip to main content

Japan Postpones Moon Landing: జపాన్‌ మూన్‌ ల్యాండర్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా

చందమామపై తొలిసారిగా అడుగుపెట్టాలన్న జపాన్‌ లక్ష్యం చివరి నిమిషంలో సాకారం కాలేదు. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించి, పరిశోధనలు చేయడమే లక్ష్యంగా జపాన్‌ చేపట్టిన మూన్‌ ల్యాండర్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది.
 Japan Postpones Moon Landing
Japan Postpones Moon Landing

జాక్సా టానేగాషిమా స్పేస్‌ సెంటర్‌లోని యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్‌2–ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది.
ప్రతికూల వాతావరణం కారణంగా లాంచింగ్‌కు 27 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘జాక్సా’ తెలియజేసింది. ప్రయోగ కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో బలమైన గాలులు వీచడం, ఉపరితల వాతావరణంలో అనిశి్చత పరిస్థితులు నెలకొనడం వల్లే వాయిదా పడినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. సెపె్టంబర్‌ 15వ తేదీ తర్వాత తదుపరి ప్రయోగం ఉండొచ్చని సమాచారం.

Vikram Lander Image : విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రగ్యాన్‌ రోవర్‌

చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో సాఫ్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌(స్లిమ్‌) అనే లూనార్‌ ప్రోబ్‌ను జపాన్‌ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన ఐదో దేశంగా జపాన్‌ రికార్డు సృష్టిస్తుంది. అయితే ప్రయోగించిన 4 నెలల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇదిలా ఉండగా, హెచ్‌–2ఏ రాకెట్‌ ద్వారా ఇప్పటిదాకా 46 ప్రయోగాలు చేయగా, అందులో 45 ప్రయోగాలు విజయవంతమయ్యాయి.  

Chandrayaan-3: జయహో భారత్‌... చంద్ర‌య‌న్‌-3 ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్‌

Published date : 30 Aug 2023 07:13PM

Photo Stories