Skip to main content

James Webb telescope: మన ముంగిట్లో మరో ఏడు ‘భూములు’!

ఒకటి కాదు, రెండు కాదు. అచ్చం భూమిలాగే ఉన్న ఏడు గ్రహాలను జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చింది!

ఇవన్నీ మనకు కేవలం 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్‌–1 అనే నక్షత్ర వ్యవస్థలో ఉన్నాయట. రాళ్లు, పర్వతాలమయంగా ఉన్న ఈ గ్రహాల ఉపరితలంపై అపారమైన జల వనరులకు పుష్కలంగా ఆస్కారముందట. మన మహాసముద్రాలన్నింట్లోనూ ఉన్నదాని కంటే ఎక్కువ జలమున్నట్టు తేలినా ఆశ్చర్యం లేదని సైంటిస్టులు అంటున్నారు. వాటిపై జీవం ఉనికికి అనువైన పరిస్థితులున్నాయా అన్నది తేల్చడంలో వారిప్పుడు తలమునకలయ్యారు. ‘‘ఈ గ్రహాలపై నెలకొన్న వాతావరణ పరిస్థితులు తదితరాలపై జేమ్స్‌ వెబ్‌ ప్రస్తు తం దృష్టి సారించింది. ఈ విషయమై కొత్త సంవత్సరంలో మనకు పెద్ద శుభవార్తే అందవచ్చు’’ అని నాసా చెబుతోంది. ట్రాపిస్ట్‌ పరిమాణంలో సూర్యునిలో పదో వంతుంటుందట.

Kepler Planets: నీటి గ్రహాలు.. భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవి!

Published date : 28 Dec 2022 03:19PM

Photo Stories