PSLV-C53 ప్రయోగం విజయవంతం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ53 ఉపగ్రహ వాహకను జూన్ 30న సాయంత్రం 6.02 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. షార్ కేంద్రం నుంచి 81వ ప్రయోగాన్ని, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 55వ ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో శాస్త్రవేత్తలు తమ విజయ విహారాన్ని కొనసాగించారు. నాలుగుదశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 19.36 నిమిషాల వ్యవధిలో 522.8 కేజీల కిలోలు బరువున్న మూడు ఉపగ్రహాలను భూమికి 570 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో వాణిజ్యపరమైన ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
Also read: ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగం
Published date : 01 Jul 2022 05:37PM