ISRO: విజయవంతంగా హైబ్రిడ్ మోటార్ç పరీక్ష
ఉపగ్రహాల వాహక నౌకల్లోని ప్రొపల్షన్ వ్యవస్థకు ఉపకరించే హెచ్‌టీపీబీ (హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబుటాడైన్ ).. హైబ్రిడ్ మోటార్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో వీఎస్‌ఎస్‌సీ, ఇస్రోలు సంయుక్తంగా ఈ పరీక్ష చేపట్టాయి. ఇంధనం, ద్రవ ఆక్సిజన్ (ఎల్‌ఓఎక్స్) ఆక్సిడైజర్‌లతో కూడిన 30–కేఎన్ మోటారు దహన శక్తిని 15 సెకన్ల పాటు పరీక్షించారు. ఈ మోటార్లు వాహక నౌకలోని ప్రొపల్షన్ వ్యవస్థను నియంత్రించటం, పునఃప్రారంభ ప్రక్రియను సులభతరం చేస్తాయని ఇస్రో అధికారులు బెంగళూరులో వెల్లడించారు. ఇస్రో ఇప్పటి వరకు ఉపయోగించే ఘన–ఘన, ద్రవ–ద్రవ మిశ్రిత ఆక్సిడైజర్ల స్థానంలో ఇంధన–ద్రవ ఆక్సిడైజర్లను వినియోగించేందుకు ఈ మోటార్ ఉపయోగపడనుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP