Driver-less Vehicles: డ్రైవర్ లేకుండా వాహనాలపై ఐఐటీహెచ్ ప్రయోగాలు
ఐఐటీ హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా వాహనాలను నడిపే సాంకేతికతలపై ప్రయోగాలకు వేదికను (టెస్ట్‌బెడ్) అందుబాటులోకి తెచ్చింది. జాతీయ మిషన్‌లో భాగంగా ఇక్కడ సైబర్ ఫిజికల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం టీహాన్ (TiHAN) ను ఏర్పాటు చేశారు. ఇందులో భవిష్యత్తు నావిగేషన్ వ్యవస్థలతోపాటు మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు రూపొందిస్తున్నారు. డ్రైవర్ లేకుండా వాహనాలు నడిపే సాంకేతికతకు రూపునిచ్చే క్రతువులో 40 మందికి పైగా యువ పరిశోధకులు భాగస్వాములవుతున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో గొప్ప మార్పులు వస్తాయని పరిశోధకులు తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP