IVAC: ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు పిల్లలకు డయేరియా, న్యుమోనియా టీకాలు ఇవ్వడంలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ యాక్సెస్ సెంటర్(ఐవీఏసీ) ప్రశంసించింది. ఈ మేరకు ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా నవంబర్ 12న ఒక నివేదికను విడుదల చేసింది.
నవంబర్ 12న...
ప్రతియేటా నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలు.
రోటావైరస్ టీకాను ఎందుకోసం ఉపయోగిస్తారు?
న్యుమోనియా నుంచి రక్షణ కల్పించే న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) కవరేజీ 2019లో 15 శాతం కాగా, 2020లో 21 శాతానికి భారత్ చేరిందని ఐవీఏసీ వెల్లడించింది. ఇక డయేరియా నుంచి పిల్లలకు రక్షణ కల్పించే రోటావైరస్ టీకా కవరేజీ 2019లో 53 శాతం కాగా, 2020లో ఏకంగా 82 శాతానికి చేరుకుందని పేర్కొంది.
చదవండి: దేశంలోని ఏ రాష్ట్రంలో నోరోవైరస్ వెలుగులోకి వచ్చింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డయేరియా, న్యుమోనియా టీకాలు ఇవ్వడంలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించింది
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ యాక్సెస్ సెంటర్(ఐవీఏసీ)
ఎందుకు : న్యుమోనియా అరికట్టేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్