Skip to main content

Mission Divyastra: అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం విజయవంతం..

డీఆర్‌డీఓ అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరిట ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి మార్చి 11వ తేదీ జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు.
Prime Minister Narendra Modi celebrating the success of the launch  India Agni-5 missile makes maiden flight with MIRV   Mission Divyastra launch celebration

ముఖ్య విషయాలు..

  • ఈ క్షిపణి ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించగలదు.
  • 5,000 నుండి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు.
  • తక్కువ బరువున్న వార్‌హెడ్లతో 8,000 కి.మీ. దాకా ఛేదించగలదు.
  • ఈ ప్రయోగం భారతదేశ ఖండాంతర అణు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
  • భారత్‌ను ఎంఐఆర్‌వీ సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాలలో ఒకటిగా నిలిపింది.
  • ఈ ఘన విజయం భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.
  • రక్షణ రంగంలో మహిళా శక్తి యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక మహిళ కావడం తెలియజేస్తుంది.

అగ్ని క్షిపణి శ్రేణి..

  • అగ్ని-1 నుండి అగ్ని-4 వరకు అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుండి 3,500 కి.మీ. దాకా ఉంది.
  • అగ్ని-5 క్షిపణి మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలను ఛేదించగలదు.

Samudrayaan: త్వరలోనే సముద్రయాన్ ప్రాజెక్టును చేపట్టనున్న భారత్..

భారతదేశ రక్షణ సామర్థ్యం..

  • అగ్ని-5 క్షిపణి విజయవంతమైన ప్రయోగం భారతదేశ ఖండాంతర అణు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
  • భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది.
  • మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి. అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం. 

Nuclear Power Plant on Moon: చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం.. 2035 నాటికి..

Published date : 12 Mar 2024 04:31PM

Photo Stories