IIT Mandi: ఇంటి వెలుగుతో విద్యుత్తును సృష్టించిన ఐఐటీ మండీ
Sakshi Education
కాంతితో విద్యుత్తును తయారు చేయాలంటే.. సూర్యుని కోసం వెతకనక్కరలేదు. ఇంటిలోని వెలుగు చాలు. సూర్యకాంతి లేకున్నా ఇంటిలోని ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్ లైట్ల కాంతితోనూ విద్యుచ్ఛక్తిని తయారు చేసే ప్యానెల్స్‌ను ఐఐటీ–మండి శాస్త్రవేత్తలు రూపొందించారు. ‘సోలార్ ఎనర్జీ’ జర్నల్‌లో ఈ ప్రయోగ ఫలితాలను ప్రచురించారు. బల్బులు వంటి కృత్రిమ వనరుల నుంచి కాంతిని గ్రహించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ‘థిన్–ఫిల్మ్ ఎఫిషిమెంట్ ఫోటో వోల్టాయిక్ సెల్స్’ ను వీరు తయారుచేశారు. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయం నిపుణులు ఈ పరిశోధనలో సహకారాన్ని అందించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 09 Dec 2022 03:47PM