Chang-5 Mission: చంద్రునిపై కొత్త లోహం
Sakshi Education
చంద్రునిపై చైనా ఓ కొత్త లోహాన్ని కనుగొన్నది. చాంగ్-5 మిషన్ లో భాగంగా రాయి, ధూళితో కూడిన మిశ్రమ నమూనాలను 2020లోనే భూమిపైకి తీసుకొచ్చింది. 1,40,000 నమూనాలను క్షుణ్నంగా వేరు చేసి.. అందులో ఒక స్ఫటికాకార లోహాన్ని తాజాగా కనుగొన్నది. దీనికి చాంగేసైట్-వైగా నామకరణం చేసినట్లు చైనా అటామిక్ ఎనర్జీ అథారిటీ పేర్కొన్నది. ఇప్పటి వరకు మొత్తం మూడు దేశాలు చంద్రునిపై కొత్త లోహాలను కనుగొన్నాయి. అందులో అమెరికా, రష్యా ఉండగా.. ఇప్పుడు వాటి సరసన చైనా చేరింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 23 Sep 2022 05:06PM