Skip to main content

Chandrayaan-3 Moon Visuals: నీలి ఆకుపచ్చ రంగులో చందమామ

చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్‌–3 మిషన్‌ ఆదివారం చిత్రీకరించింది. ఈ వీడియోను ఇస్రో సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది.
chandrayaan-3-Moon-Visuals
chandrayaan-3-Moon Visuals

చంద్రయాన్‌–3 మిషన్‌ శనివారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలి ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా చందమామపై ఉన్న లోతైన బిలాలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రుడికి సంబంధించి చంద్రయాన్‌–3 పంపించిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. 

☛☛ Chandrayaan-3 heads towards Moon: చంద్రుని వైపు చంద్రయాన్‌-3 ప్రయాణం

 

Published date : 07 Aug 2023 01:49PM

Photo Stories