Skip to main content

Chandrayaan 2: చంద్రుడిపై పుష్కలంగా సోడియం

Chandrayaan 2:

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌ 2 ఉపగ్రహం కీలక సమాచారాన్ని సేకరించింది. జాబిల్లి ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌ 1లోని ఎక్స్‌రే ఫ్లోరెసెన్స్‌ స్పెక్ట్రోమీటర్‌ (సీ1ఎక్స్‌ఎస్‌) సోడియం ఆచూకీని పసిగట్టింది. జాబిల్లిపై ఈ మూలకం ఏ మేర ఉందన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా చంద్రయాన్‌ 2 ఆ వివరాలను వెలుగులోకి తెచ్చింది. ఆ ఉపగ్రహంలోని 'క్లాస్‌' అనే సాధనం సోడియం విస్తృతిని మ్యాప్‌ చేసింది. ఈ పరికరాన్ని బెంగళూరులోని యు.ఆర్‌.రావు ఉపగ్రహ కేంద్రం రూపొందించింది. దీనికి సున్నితత్వం ఎక్కువ. అందువల్ల సోడియం సంకేతాలను పట్టుకోగలిగింది.

September Weekly Current Affairs (Science & Technology) Bitbank: In which country Khosta-2 variant of coronavirus was found in bats?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Oct 2022 01:13PM

Photo Stories