Purity Hydrogen: స్వచ్ఛ హైడ్రోజన్‌ను ఉత్పత్తిచేసే ఉత్ప్రేరకాలు
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ ను తయారు చేసేందుకు జోధ్‌పూర్ ఐఐటీ పరిశోధకులు నానో కంపోజిట్ ఉత్ప్రేరక పదార్థాలను అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో వీరు నీటిని.. హైడ్రోజన్ , ఆక్సిజన్‌గా మార్చేందుకు సహజ సూర్యకాంతిని ఉపయోగించారు. ఈ ప్రక్రియను కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియగా పిలుస్తారని, ప్రకృతి సిద్ధంగా మొక్కల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ ఇలాగే జరుగుతుందని ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించేందుకు మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొంటాయని.. ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్‌తో చర్య జరిపి కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయని వివరించారు. తాము రూపొందించిన ఉత్ప్రేరకం కూడా కృత్రిమ పద్ధతిలో ఇదేవిధంగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP