Y-Hub: వై–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించనున్న రాష్ట్రం?
ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు బడ్జెట్ స్కూళ్లకు చెందిన 6–10వ తరగతి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–2021 ఫినాలే ఏప్రిల్ 4న హైదరాబాద్ గోల్కొండలోని తారామతి–బారాదరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
UNESCO: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న కట్టడం?
కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, టీచర్లు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా పిల్లలు, యువత కోసం ‘వై–హబ్’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి రానున్న టీ–హబ్ 2.0 భవనంలో 10 వేల చ.అ. విస్తీర్ణంలో వై–హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Andhra Pradesh: ముల్క్ హోల్డింగ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఎక్కడ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘వై–హబ్’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : సృజనాత్మకతకు పదును పెట్టేందుకు.. పిల్లలు, యువత కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్