Telangana: ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఏది?
తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన ‘‘మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర’’ ఫిబ్రవరి 16న ఘనంగా ఫ్రారంభమైంది. కన్నెపల్లి(ములుగు జిల్లా) నుంచి సారలమ్మ, కొత్తగూడ మండలం(మహబూబాబాద్)లోని పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం(ములుగు జిల్లా)లోని కొండాయి నుంచి గోవింద రాజులు మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి వన దేవతల రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి ఫిబ్రవరి 17న చేరుస్తారు. మేడారం సమీపంలోని చిలకల గుట్ట(ములుగు జిల్లా)పై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. ఫిబ్రవరి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది.
కోటి మందికి పైగా..
తెలంగాణలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతరను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్తులు వస్తారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. మేడారం జాతర–2022కు నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.2.5కోట్లు విడుదల చేశాయి.
చదవండి: విభజన సమస్యలపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండం, ములుగు జిల్లా, తెలంగాణ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్