Telangana: ఏ జలాశయాల పరిరక్షణ కోసం 111 జీవోను జారీ చేశారు?
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్‌కుమార్ ఏప్రిల్ 20న జీవో నంబర్ 69 జారీ చేశారు.
Electricity: బయోమాస్ పెల్లెట్స్ అని వేటిని అంటారు?
ఈ నీటి అవసరం లేదు..!
‘‘అప్పట్లో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ను, వాటి పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 111 జీవో ద్వారా ఆంక్షలు విధించారు. జీవో జారీ చేసినప్పుడు ఆ రిజర్వాయర్ల నుంచి నగరానికి అందించే తాగునీరు 27.59 శాతం వరకు ఉండేది. ప్రస్తుతం సరఫరా అయ్యేది 1.25 శాతమే. ఇప్పుడు నగర ప్రజలు తాగునీటి కోసం ఈ రిజర్వాయర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. 111 జీవో ఆంక్షలను తొలగిస్తున్నాం’’ అని ప్రభుత్వం పేర్కొంది.
హిమాయత్ సాగర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వ్యక్తి ఎవరు?
84 గ్రామాల పరిధిలో..
హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అందించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాలపై నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం విపరీతంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవో ఎత్తివేయాలన్న డిమాండ్ మొదలైంది.
సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ..
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో.. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వాటర్ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉంటారు.
1.32 లక్షల ఎకరాలు..
గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలోని భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ అందుబాటులోకి రానున్నాయి.
Manufacturing Facility: బిలిటీ ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవో ఎత్తివేత
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్