Skip to main content

CM KCR: తెలంగాణ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

CM KCR - CM Hemant Soren

జార్ఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. మార్చి 4న జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగిన ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పొరుగున ఉన్న చైనా సహా ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందగా.. మన దేశం చాలా విషయాల్లో వెనుకబడిపోయిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హేమంత్‌ సోరెన్‌తో జాతీయ రాజకీయాల గురించి చర్చించానని, ఫలవంతంగా చర్చలు జరిగాయని కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. అమర జవాన్‌ కుందన్‌ కుమార్‌ ఓఝా భార్య నమ్రతాకుమారికి.. మరో అమర జవాన్‌ గణేశ్‌ కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్‌ అందజేశారు.

కేంద్ర జల శక్తి శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మార్చి 4న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టుకు సందర్శించారు. ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా తాడ్వాయి వద్ద నిర్మించిన పునరావాస కాలనీలను పరిశీలించారు.  పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి షేకావత్‌ చెప్పారు.

AP State Aquaculture Development Authority: అప్సడా చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జార్ఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌తో సమావేశం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు    : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ    : రాంచీ, జార్ఖండ్‌
ఎందుకు : జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకు..​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Mar 2022 04:04PM

Photo Stories