Tabs Distribution: గుడ్ న్యూస్.. ఉచితంగా ఇవ్వనున్న మరో 24,232 ట్యాబ్‌లు.. ఎప్పుడంటే..?
Sakshi Education
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు గత నెలలో 5,161 ట్యాబ్‌లను అదజేశారు.
రెండో విడతలో జనవరి 13వ తేదీ 24,232 ట్యాబ్‌లు వచ్చాయి. వీటిని కర్నూలు జిల్లా నోడల్ ఆఫీసర్ డా.ధన్‌రాజు ఓ స్కూల్‌లోని గదిలో భద్ర పరిచారు. సంక్రాంతి సెలవులు ముగిసిన మరుసటి రోజునే అన్ని పాఠశాలలకు వీటిని పంపించనున్నారు. రెండో, మూడు రోజుల్లో టీచర్లకు అందించాల్సిన ట్యాబ్‌లు సైతం జిల్లాకు రానున్నాయి. ప్రస్తుతం ఇవ్వనున్న ట్యాబ్‌లలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో మొత్తం 7 రకాల యాప్స్ (డిక్షనరీ, బైజ్యూస్ ప్రీమియం కంటెంట్, ఏపీ ఈ–పాఠశాల, అసెస్‌మెంట్, సీఫ్ట్ చార్ట్, ఆర్టిఫీషియల్ బోట్ యాప్, వైఫై–మానిటర్) ఉండనున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నల్ లాక్డ్ సిస్టమ్ ..ఎవరైనా ఆ లాక్ ఓపెన్ చేసినా సులువుగా గుర్తించే విధంగా ట్యాబ్‌లను రూపొందించారు.
Tabs Distribution: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ.. ట్యాబ్ విలువ ఎంతంటే..?
Published date : 17 Jan 2024 12:43PM