Skip to main content

Bigg Boss: బిగ్‌బాస్‌ సీజన్‌–6 విజేత రేవంత్‌

తెలుగు సినీ గాయకుడు రేవంత్‌ బిగ్‌బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌–6 విజేతగా నిలిచారు.

డిసెంబ‌ర్ 18న‌ జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో రేవంత్‌ ఈ ట్రోఫీని దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. గ్రాండ్‌ ఫినాలేకు రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి భట్, రోహిత్‌ చేరుకున్నారు.  టైటిల్‌ పోరులో శ్రీహాన్, రేవంత్‌ టాప్‌–2లో నిలిచారు. గోల్డెన్‌ బాక్స్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యాఖ్యాత, సినీ నటుడు నాగార్జున ఇద్దరికీ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. ప్రైజ్‌ మనీ (రూ.50 లక్షలు)లో సగం తీసుకుని హౌస్‌ నుంచి వెళ్లిపోవచ్చని సూచించాడు. కానీ దీనికి ఇద్దరూ అంగీకరించలేదు. దీంతో ఆ మొత్తాన్ని రూ.30 లక్షలకు, ఆ తర్వాత రూ.40 లక్షలు పెంచడంతో శ్రీహాన్‌ ఆ మొత్తం తీసుకొని రన్నరప్‌గా నిలిచారు. దీంతో రేవంత్‌కు రూ.10 లక్షలు, బిగ్‌బాస్‌ సీజన్‌–6 ట్రోఫీ దక్కాయి. 

SS Rajamouli: రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Published date : 19 Dec 2022 06:49PM

Photo Stories