AP Infra Projects: 9 ప్రాజెక్టులు(రూ.15,233 కోట్లు)లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ
Sakshi Education
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేయనున్నారు.
శంకుస్థాపనల ప్రాజెక్టులు..
- రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో..
- రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ.
- రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్– విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్.
- రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు.
- రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి.
- రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
Also read: E-Mobility week celebration: హైదరాబాద్ నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవాలు
జాతికి అంకితంచేసే ప్రాజెక్టులు
- రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో
- రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం– నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి.
- రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసీ యు–ఫీల్డ్.
- రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్ గ్రాస్ రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం.
- రూ.4,106 కోట్లతో విజయవాడ– గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం– నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి.
Also read: Electric Double Deckers: భాగ్యనగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్‌లు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Nov 2022 03:45PM